బాలీవుడ్ హీరోయిన్స్ కి డేటింగ్ అనేది చాలా కామన్. మన దగ్గర కన్నా అక్కడ ఇలాంటివి చాలా రొటీన్ గా జరుగుతుంటాయి. అక్కడ ఒక్కో హీరోయిన్ ముగ్గురు నలుగురితో డేటింగ్ చేసి ఉంటారు. వీరిలో లైగర్ భామ అనన్యా పాండే కూడా ఉందని తెలుస్తుంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తను డేటింగ్ చేసిన వారి గురించి చెప్పింది అనన్యా పాండే. తన జీరో సైజ్ లుక్ తో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ అమ్మడు అక్కడ వరుస అవకాశాలు అందుకుంటుంది.
Ananya Pandey మొదటి హీరో ఇషాన్ కత్తర్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది. అతనితో బోర్ కొట్టేసిన తర్వాత కార్తీక్ ఆర్యన్ తో కూడా కొన్నాళ్లు డేటింగ్ లో ఉంది. అయితే కార్తీక్ ఆర్యన్ సారా అలి ఖాన్ తో క్లోజ్ అవడంతో అనన్యా అతన్ని దూరం చేసింది. అయితే ఈమధ్య ఆదిత్య రాయ్ కపూర్ తో క్లోజ్ గా ఉంటున్నావ్ అని కరణ్ అడిగాడు. దానితో అవును అతను చాలా మంచి వ్యక్తి అని అన్నది అనన్యా.
అంటే ప్రస్తుతం ఆమె అతనితోనే డేటింగ్ లో ఉందని కన్ ఫర్మ్ చేస్తున్నారు. అతనంటే తనకు చాలా ఇష్టమని.. అతను అందంగా ఉంటాడని చెబుతుంది అనన్యా పాండే (Ananya Pandey).