ఎవరైనా పెళ్లికి ముందు రెచ్చిపోయి పెళ్లి అయ్యాక సైలెంట్ అవుతారు. కానీ నయనతార మాత్రం రివర్స్ లో పెళ్లి తర్వాత అందాలతో రెచ్చగొడుతుంది. కొన్నాళ్లుగా డైరక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయన్ (Nayanatara) రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట వారి ఫోటోలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఎప్పుడూ గ్లామర్ షో చేయని నయనతార పెళ్లి అయ్యింది కదా అని రెచ్చిపోతుంది.
భర్త విఘ్నేష్ శివన్ తో నయన్ దిగిన ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎలాగు పెళ్లి అయ్యింది కదా అని నయనతార (Nayanatara) అందాలను చూపించేస్తుంది. మెడలో తాళి ఉంచుకుని నయన్ చేస్తున్న ఈ గ్లామర్ షో చూసి అందరు అవాక్కవుతున్నారు. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే ఈమధ్యనే జీ స్టూడియోస్ వారు చేస్తున్న ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు సైన్ చేసిందట.
ఆ సినిమా కోసం నయనతార 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగినట్టు టాక్. నయన్ క్రేజ్ తెలుసు కనుక ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అన్నారట. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తుంది నయనతార.