Kareena Kapoor : 17 ఏళ్లుగా దానికి దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) రీసెంట్ ఇంటర్వ్యూలో తను 17 ఏళ్లుగా ఒక దానికి దూరంగా ఉన్నానని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకీ కరీనా కపూర్ దేనికి దూరంగా ఉంది అంటే సుగర్ కి అని తెలుస్తుంది. మాములుగా అయితే సుగర్ లేనిది ఇంట్లో ఏ పదార్ధం అంత రుచి కరంగా ఉండదు. కానీ కరీనా కపూర్ సుగర్ ని పూర్తిగా ఎవైడ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు తన పిల్లలకు కూడా అది లేకుండానే ఫుడ్ అల్వాటు చేస్తుందని తెలుస్తుంది.

కరీనా కపూర్ సుగర్ లేకుండా దాదాపు 17 ఏళ్లుగా తన జీవనం సాగిస్తుందని తెలుస్తుంది. సుగర్ వల్ల చాలా హెల్త్ సమస్యలు వస్తాయని. డయాబెటిక్ సమస్యలకు సుగర్ వల్లే ఎక్కువ ప్రభవం ఉంటుందని చెబుతుంది. సుగర్ లేకుండా తను 17 ఏళ్లుగా తన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నానని. సుగర్ బదులుగా హనీని వాడుకుని తీపి పదార్ధం తినాల్సి వస్తే తింటానని అంటుంది కరీనా కపూర్ (Kareena Kapoor).

ఫుడ్ డైట్ విషయంలో చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్నాళ్లకే వారు దాన్ని అలవాటు చేసుకోలేక మళ్లీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ లోకి వచ్చేస్తారు. కానీ కరీనా మాత్రం సుగర్ విషయంలో కాంప్రమైజ్ అవలేదని చెబుతుంది. 17 ఏళ్లుగా సుగర్ ని తినట్లేదు అంటే ఆమె చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అలా మెయింటైన్ చేస్తుంది కాబట్టే కరీనా కపూర్ ఇప్పటికి చాలా గ్లామర్ గా కనిపిస్తుంది.

Tags: Bollywood, Kareena Kapoor, Saif Ali Khan, Star Heroine, Sugar