బుల్లితెర మీదకు స్టార్స్ ని తీసుకు రావడం అనేది చాలా పెద్ద టఫ్ జాబ్. అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ సైతం ఓటీటీల్లో, స్మాల్ స్క్రీన్స్ లో రియాలిటీ షోలకు హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ మా దాదాపు సెలబ్రిటీస్ అందరిని హోస్ట్ గా తీసుకొచ్చింది. బిగ్ బాస్ కోసం ఎన్.టి.అర్, నాగార్జున, నానిలను వాడేసిన స్టార్ మా మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం నాగ్, చిరులని తీసుకొచ్చింది. జెమిన్ని టీవీలో కూడా తారక్ ఒక షో హోస్ట్ చేశాడు.
అయితే హోస్ట్ గా కాకున్నా సరే సరదాగా అయినా మహేష్ ని స్టార్ మా రియాలిటీ షోకి తీసుకు రాలేకపోయింది. స్టార్ మా వల్ల కానిది జీ తెలుగు వల్ల అయ్యింది. జీ తెలుగులో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోకి మహేష్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈటీవీలో అన్ని సీజన్లు డ్యాన్స్ షోలు జరిగాయి. స్టార్ మాలో కూడా డ్యాన్స్ షోలు చేస్తున్నారు. కానీ జీ తెలుగు కోసం మాత్రం మహేష్ ని దించారు. మహేష్ తనతో పాటు మహేష్ డాటర్ ప్రిన్సెస్ సితార కూడా ఈ షోకి వచ్చారు.
జీ తెలుగులో రాబోతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోకి సూపర్ స్టార్ మహేష్ మరింత క్రేజ్ తెచ్చారని చెప్పొచ్చు. జీ తెలుగుతో మహేష్ కి ప్రత్యేక అనుబంధం ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమాకి రెడీ అవుతున్నాడు.