టాలీవుడ్ హీరోయిన్ తాప్సి పన్ను.. మంచు మనోజ్‌తో కలిసి ఝుమ్మంది నాదం సినిమాలో నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన తాప్సి మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఊహించిన రెండో సక్సెస్ రాలేదు. ఇక తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్‌కి చెకేసింది తాప్సి. అక్కడ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తాప్సి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
సినిమాలతో కంటే తన కామెంట్స్‌తోనే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది తాప్సి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తిప్సీ కాస్టింగ్ కోచ్ పై కొన్ని ఆసక్తికర విషయాలను వివరించింది. తను బాలీవుడ్ లో అడుగు పెట్టిన కొత్తలో చాలామంది స్టార్ హీరోస్, డైరెక్టర్స్ తనకు ఫోన్ చేసి అర్ధరాత్రి వాళ్ళ గెస్ట్ హౌస్ కు రమ్మనే వారిని ఫోన్ కట్ చేసేదాన్ని.. అయినా కూడా పదేపదే వినకుండా ఫోన్లు చేసి విసిగించేవారని చెప్పుకొచ్చింది.
అంతేకాదు బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలైతే తమతో డేటింగ్ చేయాలని నన్ను వేధించారని.. లేదంటే సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేస్తానంటూ బెదిరించారని చెప్పుకొచ్చింది. కానీ నేను వాటిని లెక్క చేయకుండా నా కష్టం పైన ఆధారపడ్డాను అంటూ వివరించిన తాప్సి కాస్టింగ్ కౌచ్ పై చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.