బాలయ్య గురించి ఈ విషయం తెలిస్తే అభిమానులే కాదు అందరూ జై బాలయ్య అనాల్సిందే.. అది కదా బాలయ్య..!

బాలయ్య ఈ పేరులో ఓ ఎనర్జీ ఉంటుంది. సిచ్యూవేష‌న్‌ కు సంబంధం లేకుండా మన నోటి వెంట వచ్చేది జై బాలయ్య అన్న పదం. అంత గ్రేస్ సంపాదించుకున్న బాలయ్య… మరింత జోష్ తో సినిమాలో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఈ న్యూస్ వింటే బాలయ్య అభిమానులు నిజంగా మా బాలయ్య రియల్ హీరో అంటారు. ఇక మిగతా హీరో అభిమానులు కూడా మెచ్చుకోవాల్సిందే. అందరు హీరోలకు అభిమానులు ఉండటం సహజం కానీ బాలయ్య అభిమానులు ప్రేమకు మాత్రం హద్దులు ఉండవు.

బాలయ్య బయటకి ఆగ్రహంగా కనిపించిన మనసు మాత్రం వెన్న అని గత ఏడాది వచ్చిన అన్ స్టాపబుల్ షోతో ఒకప్పుడు బాలయ్య అంటే కోపిస్ట్ అనుకునేవారు కానీ బాలయ్య ఎంత మంచి వారిని ఈ షో తో అందరికీ తెలిసింది. ఆఖండతో స్టార్ట్ అయిన సక్సెస్ జర్నీ అన్ స్టాపిబుల్ , వీర సింహారెడ్డి సినిమాల వరకు కొనసాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్, కూతురుగా శ్రీ లీల న‌టిస్తుంది. బాలయ్య క్రేజ్‌త‌న‌ తోటి హీరోల క్రేజ్ కంటే కొంచెం ఎక్కువే ఉంది. బాలయ్య సినిమాలు కూడా బాగానే సక్సెస్ అవుతాయి. కానీ బాలయ్య మాత్రం రెమ్యూనరేషన్ చాలా తక్కువ తీసుకుంటున్నారని తెలుస్తుంది.బాలయ్య ఒక్కో సినిమాకు కేవలం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. బాలయ్య నిర్మాతల పరిస్థితి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ మా హీరో నిజమైన హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బాలయ్య కేవలం సినిమాలకి అభిమానులకి హీరో మాత్రమే కాదు… నిర్మాతల విషయంలో కూడా దేవుడు అంటున్నారు. ఇక భగవంత్‌ కేసరి అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ పిరియాడిక్ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. అది కూడా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీనికి డైరెక్షన్ వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.