హీరోయిన్ మేఘా ఆకాష్ ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో తెలుసా… ఆ హీరోతోనూ డీప్‌గా…!

యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ మొదటి నుంచి వరుస‌ సినిమాలు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేదు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా తన లక్‌ పరీక్షించుకుంది. అయితే ఏ ఇండస్ట్రీలోనూ మేఘా ఆకాష్‌కు సరైన సక్సెస్ రాలేకపోయింది. ఇక రీసెంట్‌గా రవితేజకు జంటగా రావణాసుర సినిమా చేసింది ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం ఏవో అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తున్న మెఘా ఆకాష్ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తన ఫస్ట్ లవ్ గురించి కూడా మెఘా ఆకాష్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాని రివీల్ చేసింది. మేఘా ఆకాష్ తన నాలుగో క్లాసులోనే ప్రేమలో పడిపోయిందట. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తాను ఫోర్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లోనే తన పక్కన కూర్చున్న ఓ అబ్బాయిని ఇష్ట‌ప‌డ్డానని.. అదే తన ఫస్ట్ లవ్ అని తెలిపింది. తన చదువు పూర్తయిన తర్వాత షారుక్ ఖాన్ తో ప్రేమలో పడిపోయినని… తన లైఫ్‌లోనే బెస్ట్‌ క్రష్‌గా షారుక్ ఖాన్ పేరు చెప్పింది. తనకు ప్రేమ పెళ్లి చేసుకోవటమే ఇష్టమని చెప్పింది. ఇప్పుడు దీంతో మేఘా ఆకాష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే రీసెంట్‌గా మేఘా ఆకాష్ పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయుడు కుమారుడితో ఆమె ఏడడుగులు వేయ‌బోతోందని ప్ర‌చారం జ‌రిగింది. అయితే దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అంత‌కు ముందే మేఘా నితిన్‌తో వ‌రుస‌గా రెండు సినిమాల్లో న‌టించిన‌ప్పుడు నితిన్ – మేఘా ప్రేమ‌లో ఉన్నార‌ని.. వారిద్ద‌రు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది.