BiggBoss 6 : విడిపోతారనుకున్న జంట.. బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా..?

బిగ్ బాస్ సీజన్ 6కి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం రోజుల్లో షో కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే సీజన్ 6 (BiggBoss 6)లో వచ్చే కంటెస్టంట్స్ లిస్ట్ ఇదే అని చాలామంది యూట్యూబర్స్ చెప్పేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో ఓ స్టార్ కపుల్ ని హౌజ్ లోకి పంపిస్తున్నారని తెలుస్తుంది. సీజన్ 3లో వరుణ్ సందేశ్, వితికలని పంపించారు. రియల్ జోడీ హౌజ్ లో బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 6లో సింగర్స్ జోడీ హేమ చంద్ర, శ్రావణ భార్గవిలను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తున్నారట.

మొన్నామధ్య వీరిద్దరు విడిపోతున్నారన్నట్టుగా వార్తలు వచ్చాయి. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఫైనల్ గా మేం విడిపోవట్లేదు కలిసే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చి వారి బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేసుకోవాలని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 (BiggBoss 6)లో స్టార్ కపుల్ గా హేమచంద్ర శ్రావణ భార్గవి కానున్నారు.

అయితే వీరి ఎంట్రీ కన్ ఫర్మా కాదా అన్నది షో స్టార్ట్ అయితేనే కాని తెలియదు. సీజన్ 6లో 19 మంది స్టార్ కంటెస్టంట్స్ ఉంటారని తెలుస్తుంది. ఈ సీజన్ ని ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం.

Tags: BiggBoss 6, BiggBoss Season 6, BiggBoss Telugu, nagarjuna, Star Couple, Star Maa, Telugu BiggBoss