సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాలో మహేష్ అల్ ట్రా మోడ్రెన్ లుక్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడని తెలుస్తుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి టైటిల్ కన్ ఫ్యూజన్ లో పెట్టేశారు మేకర్స్. అయితే సినిమా షూటింగ్ మొదలవగానే ఓ స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్ సినిమా టైటిల్ కూడా అదే అంటున్నారు.
SSMB 28 ఆరంభం అని వీడియోలో పెట్టగా సినిమా టైటిల్ ఆరంభం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత రాబోతున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆరంభం టైటిల్ తో ఆల్రెడీ అజిత్ డబ్బింగ్ మూవీ వచ్చింది. త్రివిక్రం కి అ.. ఆ అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఎలాగు ఉంది కాబట్టి ఆరంభం అని పెట్టినా పెట్టొచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ మూవీని 2023 ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ SSMB28 సినిమాని పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. అయితే మహేష్ మాత్రం కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని అంటున్నారట. మహేష్ ఎలాగు తన నెక్స్ట్ సినిమా రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా మాత్రం 300 కోట్ల బడ్జెట్ తో భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.