Nani : శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాకి నాని రివ్యూ..!

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దాదాపు నాలుగైదు సినిమాలుగా శర్వానంద్ సినిమాలు నిరాశపరచాయి. ఫైనల్మ్ గా ఒకే ఒక జీవితం సినిమా అతనికి హిట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ కూడా సినిమా మీద పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

ఆల్రెడీ ప్రీమియర్ చూసిన నాగ్ తన మదర్ గుర్తొచ్చారని రివ్యూ ఇచ్చేశాడు. అఖిల్ కూడా సినిమా సూపర్ అనేశాడు. ఇక ఇప్పుడు నాని (Nani ) కూడా శర్వానంద్ సినిమాని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ఒకే ఒక జీవితం సచ్ ఏ స్వీట్ ఫిల్మ్. శర్వానంద్ అమల మేడం మధ్య ఎమోషనల్ సీన్స్ ది బెస్ట్ అనిపించాయి. వెన్నెల కిశోర్, ప్రియదర్శి ఇంకా ముగ్గురు పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అమ్మ సాంగ్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లింది. సినిమా విజయం అందుకున్నందుకు కంగ్రాట్స్ అని ట్వీట్ చేశాడు నాని.

Nani ట్వీట్ తో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. యువ హీరోలంతా ఒకరి సినిమాకు మరొకరు ఇలా హెల్ప్ చేసుకోవడం మంచి విషయమని చెప్పాలి. శర్వానంద్ నాని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఫ్రెండ్ సినిమాకి షార్ట్ రివ్యూ ఇచ్చి అలరించాడు నాని.

Tags: Nani, Naturalstar Nani, Oke Oka Jeevitam, Sharwanand, Tollywood