యాంకర్ శ్రీముఖి సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

టాలీవుడ్ లో హీరోయిన్స్ తర్వాత అంతటి క్రేజ్ ఎవరికి ఉందంటే.. అది బుల్లి తెర యాంకర్స్ కే అని చెప్పాలి..ఎందకంటే హీరోయిన్స్ తర్వాత టీవీ యాంకర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు. బుల్లితెరపై గ్లామర్ షోలు నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు మహిళా టాప్ యాంకర్లు అంటేనే గుర్తొచ్చేది సుమ కనకాల, అనసూయ, రష్మీ, శ్రీముఖి.. వీరిలో ముఖ్యంగా శ్రీముఖి గురించి చర్చించుకుంటే.. ఆమె తన అందం, చురుకుదనంతో బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తే శ్రీముఖి త్వరలో సుమ, అనసూయ, రష్మీలను దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది..ఇక శ్రీముఖ సంపాదన గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఆమె ఒక్కో ఈవెంట్ కోసం లక్షల రూపాయలు తీసుకుంటోంది.. ఇక సైమా ఈవెంట్ కి ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది..

ఇటీవల శ్రీముఖి సైమా వేడుకల్లో పాల్గొన్నారు. నటుడు ఆలీతో పాటు తెలుగు విభాగానికి హోస్ట్ గా వ్యవహరించింది. సైమా ఈవెంట్ రెండు రోజుల పాటు జరిగింది. ఈ ఈవెంట్ కోసం శ్రీముఖికి సైమా నిర్వాహకులు రూ.10 లక్షలు చెల్లించారట. ఇక ప్రయాణ ఖర్చులు, హోటల్ ఖర్చులు తీసేస్తే.. శ్రీముఖి 9 లక్షల రూపాలకు పైనే సంపాదించిందని తెలుస్తోంది. సైమా ఈవెంట్ కి శ్రీముఖి అంత రెమ్యూనరేష్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీముఖి అంత మొత్తం తీసుకోవడం నిజమో.. కాదో తెలియదు..

కాగా ఈ వేదికపై శ్రీముఖి హీరో రణ్వీర్ సింగ్ ని ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. రణ్వీర్ సింగ్ వేదికపై నుంచి వెనక్కి వెళ్తున్నప్పుడు శ్రీముఖి వెనక్కి పిలిచింది. ఆయన్న హగ్ చేసుకోవాలని కోరిక ఉందని చెప్పడంతో.. ఆయన ఆ కోరికను మన్నించారు. శ్రీముఖికి హగ్ ఇచ్చేశారు.. అప్పుడు శ్రీముఖి, రణ్వీర్ సింగ్ ను ముద్దు పెట్టుకోగా.. ఆయన ఆమె రెండు చేతులపై ముద్దులు పెట్టారు. ఇది హాట్ టాపిక్ అయ్యింది..

ఇదిలా ఉండగా.. శ్రీముఖి ఈటీవీలో ప్రస్తుతం జాతి రత్నాలు అనే కామెడీ షోకు, జీ సరిగమప అనే సింగింగ్ షోకు యాంకరింగ్ చేస్తోంది. ఇక ఆమె సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఈ మధ్యనే అంకుల్స్ ఆంటీస్, ఇట్స్ టైం టు పార్టీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.. ఇలా ఈ అమ్మడు రెండు చేతుల సంపాదిస్తోంది..

Tags: actress, Anchor sreemukni, income, movies highlight, shows, Tollywood