నేషనల్ క్రష్ రష్మిక పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా బిజీగా గడుపుతుంది. సందీప్ వంగా డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో నటిస్తుంది రష్మిక. లేడీ ఓరియంటెడ్ మూవీ రెయిన్‌బోలోను రష్మిక కనిపించబోతుంది. అయితే తాజాగా ఆమె అసిస్టెంట్ సాయి పెళ్లికి హాజరైంది. పసుపు రంగు చీరలో ట్రెడిషనల్ లుక్‌తో నవ్వులు చిందిస్తు దర్శనమిచ్చింది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లిలో తన లుక్‌తో పెళ్లికి వచ్చిన వారందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రష్మిక వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించింది. ఇక ఈ పెళ్లిలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేడుకలో పాల్గొన్న రష్మిక నూతన దంపతులను ఆశీర్వదించింది. ఈ క్రమంలో రష్మిక కాళ్ళకు నమస్కరించి నూతన వధూవరులు ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసినా అభిమానుల సైతం దటీజ్ రష్మిక అంటూ.. రష్మిక తన సినిమాలలో బిజిగా ఉన్న కూడా అసిస్టెంట్ పెళ్ళికి హాజరు కావడం ఎంతో గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లిపై కొన్ని ఆసక్తికర విషయాలను వివరించింది. తన పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని.. కొన్నేళ్లపాటు కెరీర్ పైన దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్పా2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram