టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నాలుగు దశాబ్దాల కెరీర్ లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన రాజకీయాలకు ఇచ్చిన కొత్తగా 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికవ్వడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. 1983లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు.. 1985 ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత 1989 నుంచి 2019 ఎన్నికలకు వరకు వరుసగా కుప్పం నుంచి పోటీ చేస్తూ ఓటమి లేకుండా అప్రతిహతంగా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి గెలిచి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా కుప్పంతో పాటు రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.
అయితే కుప్పం – కళ్యాణదుర్గం రెండు రాయలసీమలోనే ఉన్నాయి. అలా కాకుండా కుప్పం తో పాటు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే ఉత్తరాంధ్రలోని ఒక నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నుంచి పోటీ చేస్తే ఎలా ? ఉంటుందన్న సమాలోచనలు ఉత్తరాంధ్ర టిడిపి నేతలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్ ఇదే శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పోటీ చేస్తే ఆ ప్రభావం విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్రపై గట్టిగా ఉంటుంది. ఇక్కడ టిడిపి సాంప్రదాయ ఓటు బ్యాంకు అయినా బీసీ వర్గాలతో పాటు ఇతర వర్గాలు కలిసి వచ్చి ఉత్తరాంధ్రను పార్టీ స్వీప్ చేస్తుందన్న అంచనాలకు కూడా ఉన్నాయి మరి చంద్రబాబు నిర్ణయం చివరిలో ఎలా ఉంటుందో చూడాలి.