‘ ఖుషి ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్ భీభ‌త్సం… విజ‌య్ ర్యాంపేజ్‌..!

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా… శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా సాలిడ్ ఓపెనింగ్ అందుకుంది. మొదటి వారం అంతా ముగిసే సమయానికి‌… ఈ పాన్ ఇండియా లవ్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ. 70.23 కోట్లను అధిగమించి… రెండు రోజుల్లోనే రు. 100 కోట్ల దాటింది.

గుడ్ కాన్సెప్ట్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ సీన్లు, ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. పైగా డీసెంట్ గా కనిపించే లవ్ డ్రామా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు న‌టించారు.

ఈ సినిమా విజ‌య్ త‌న ర్యాంపేజ్ చూపించాడ‌నే చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇటు విజయ్ దేవరకొండకు అటు సమంతా కు ఖుషి సినిమా మంచి సక్సెస్ ని అందించింది.