శ్రీముఖి పెళ్లి కుదిరిందోచ్‌… ఆయ‌న‌తోనూ మూడు ముళ్లుకు రెడీ…!

బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీముఖి యాంకరింగ్ లోనే కాక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మ‌రి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత స్టార్ మా లో జరిగిన రియాలిటీ షో బిగ్ బాస్ లో తన ప్రతిభను చాటుకుని త‌న‌కంటు ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

Anchor Srimukhi Sexy Photo Shoot Stills In Pink Half Saree

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి బుల్లితెరపై వ‌రుస ఛాన్స్ ల‌తో యాంకర్ గా రాణిస్తుంది. దాంతో పాటు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోస్ తో పాటు.. హాట్ ఫోటో షూట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శ్రీముఖి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట‌ వైరల్ గా మారాయి.

Sree Mukhi Movies, News, Photos, Age, Biography

ఎస్ శ్రీముఖి త్వరలోనే హైదరాబాద్ కు సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులోనే సెటిల్ అయినా బిజినెస్ మ్యాన్ కు దాదాపు రు. 100 కోట్లకు పైగా ఆస్తి ఉంటుందట. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్స్ ఇప్పటివరకు శ్రీముఖి వెయిట్ చేస్తే చేసింది గాని మంచి శ్రీమంతుడినే వలలో వేసుకుంది. రు. 100 కోట్ల ఆస్తికి అధిపతి కాబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే శ్రీముఖి మూడు ముళ్లుకు రెడీ అయిన‌ వార్తలో ఎంత నిజం ఉంది అనేది శ్రీముఖి స్పందిస్తే గాని తెలియదు.