అల్లూరి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ .. ఈసారైనా శ్రీవిష్ణుకి హిట్ దక్కుతుందా..!

తెలుగులో వైవిద్యభరితమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీవిష్ణు. అతడు కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు తీస్తున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర వంటి సినిమాల్లో శ్రీవిష్ణు నటించాడు. మొదటిసారి పక్కా మాస్ క్యారెక్టర్ లో అల్లూరి అనే సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటిసారి మీసం పెంచి రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు శ్రీ విష్ణు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 23 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాతలు విడుదల తేదీతో శ్రీవిష్ణు కొత్త లుక్ పోస్టర్ విడుదల చేశారు.

రాజ రాజ చోర సినిమా తర్వాత శ్రీవిష్ణుకి సరైన హిట్ లేదు. అతడి గత చిత్రం భళారే తందానాన మూవీకి మంచి రివ్యూలు వచ్చినప్పటికి ఫైనల్ గా ప్లాప్ గా నిలిచింది. దీంతో అల్లూరి సినిమా అయినా హిట్ అవ్వాలని శ్రీ విష్ణు ఆశలు పెట్టుకున్నాడు. అల్లూరి సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tags: alluri movie, sri vishnu, telugu news, tollywood news