ధనుష్ కొత్త సినిమా ట్రైలర్ .. చూస్తుంటే హిట్టయ్యేలా ఉందే…

అసురన్ సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ తీసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. ఓ హాలీవుడ్ సినిమాలో నటించగా అది కూడా ఫ్లాప్ అయింది. మరోవైపు భార్యతో విడాకులు తీసుకొని వివాదంలో కూరుకుపోయాడు. కాగా ధనుష్ తిరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మిత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ సరసన రాశీ కన్నా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఒక కీలక పాత్రలో నిత్యమీనన్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 18 వ తేదీన విడుదల కానుంది.

కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో ధనుష్ తిరు ఏకాంబరం అలియాస్ పండు క్యారెక్టర్ లో నటించాడు. ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించాడు. ట్రైలర్ లో డెలివరీ బాయ్స్ కష్టాలు ఏ విధంగా ఉంటాయో దర్శకుడు క్లియర్ గా చూపించారు. అలాగే ఇద్దరు హీరోయిన్ల ప్రేమ కోసం వారి చుట్టూ తిరిగే క్యారెక్టర్ లో ధనుష్ నటించాడు.

ఇద్దరు హీరోయిన్లలో ధనుష్ ఎవరిని ప్రేమించాడు. అతడికి నిత్యామీనన్ ఏ విధంగా సహకరించింది అనేదే మిగతా కథ. ట్రైలర్ గమనిస్తే సెంటిమెంట్, ప్రేమ, కామెడీ జోనర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న తిరు సినిమా ధనుష్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి.

Tags: Anirudh, Dhanush, Mithran R Jawahar, Sun Pictures, Thiru Official Trailer(Telugu)