ఇది విన్నారా..దృశ్యం -3 కూడా వచ్చేస్తోంది..!

కొన్నేళ్ల కిందట మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో కూడా వెంకటేష్ చేశాడు. అలాగే పలు భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. ఆ తర్వాత మోహన్ లాల్ దృశ్యం 2 తీయగా వెంకటేష్ మరోసారి తెలుగులో ఆ సినిమాను చేశాడు. దృశ్యం2 ప్రేక్షకులను ఆకట్టుకుంది. దృశ్యం1, దృశ్యం2 సినిమాలను తమిళంలో కమలహాసన్ చేశారు.

ఈ సినిమా మొదటి భాగంలో కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా మోహన్ లాల్ కుమార్తె తనను ప్రేమించిన ఒక యువకుడిని చంపేస్తుంది. ఆ కేసునుంచి హీరో తన కుమార్తె, భార్యను కాపాడటమే చిత్ర కథ. దృశ్యం2 సినిమాలో ఈ కేసును పోలీసులు రీ ఓపెన్ చేయడం, మళ్లీ హీరో అందులో నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నది చూపించారు.

అయితే ఈ సినిమాకు మూడో భాగాన్ని కూడా తెరకెక్కించాలని మలయాళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన ఒక పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. చేతికి సంకెళ్లతో వున్న మోహన్ లాల్ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్ దృశ్యం కు మూడవ పార్ట్ ఉందని హింట్ ఇచ్చారు. ఈ సినిమా కూడా జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దృశ్యం ప్రాంచైజీ లో ఈ కథ ఇక చివరిదని చెబుతున్నారు. ఈ చిత్రంతో ఈ కథకు ఎండ్ కార్డ్ వేయాలని దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Tags: drishyam 3 movie, malayalam drishyam 3, mohanlal