మొర‌గాల్సిన కుక్క‌లు తోక‌లు ఊపుతున్నాయి..

వైసీపీ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి విప‌క్ష టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఘాటుగా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. త‌న‌కు అవ‌కాశం చిక్కితే చాలు ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలుగు త‌మ్ముళ్ల‌ను తూర్పార ప‌డుతుంటారు. అలాగే మ‌రోసారి విమ‌ర్శ‌ల‌ను గుప్పించారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. ఐబీ మాజీ చీఫ్ వెంక‌టేశ్వ‌ర్‌రావు స‌స్పెండ్ చేస్తూ అధికార వైసీపీ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం తెలిసిందే. ఆ ఉత్త‌ర్వుల‌పై స్టే విధించాల‌ని కోరుతూ వెంక‌టేశ్వ‌ర్‌రావు క్యాట్‌ను ఆశ్ర‌యించాడు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన క్యాట్ అందుకు నిరాక‌రించింది. అంత‌వ‌ర‌కు బాగానే అక్క‌డే వ‌చ్చింది. చిక్కు. ఈ అంశంపైనే విజ‌య‌సాయిరెడ్డి తాజాగా స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

చంద్ర‌బాబు వ‌ద్ద శిక్షణ పొందిన కొంద‌రు దోపిడీదారులు ఇతరులపై నిందలు మోపుతూ, మరోవైపు నీతి సూక్తులు వల్లిస్తున్నారని విమర్శించారు.‘దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయ‌ని, బాటు ట్రెయినింగ్ అలాగే ఉంటుంద‌ని ఘాటుగా స్పందించారు. నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటార‌ని మండిప‌డ్డారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై గ‌గ్గోలు పెట్టిన టీడీపీ ఎల్లో మీడియా, క్యాట్ స్టే ఇచ్చిన విష‌యాన్న మాత్రం చిన్న‌దిగా రాశాయ‌ని ఎద్దేవా చేశారు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా తమ జాతి రత్నాన్ని వెనకేసుకొచ్చింది.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Tags: ap mp vijayasai reddy, tdp cheaf chandrababu naidu, twitter