‘లైగర్’ సినిమాపై శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్.. ఇలా అనేసిందేంటి భయ్యా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరోకు దర్శకుడు పూరి జగన్నాథ్ భారీ హిట్లు ఇచ్చాడు. ఎన్నో మరుపురాని సినిమాలు ఆయన తీశాడు. అయితే కొంత కాలంగా ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్నాయి. ఈ తరుణంలో ఆయన ఎనర్జటిక్ హీరో రామ్‌తో తీసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ ఊహించని విజయం సాధించింది. దీంతో పూరి మరలా ఫామ్‌లోకి వచ్చాడని అంతా భావించారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్-అనన్య పాండే జంటగా తీసిన లైగర్ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. అయితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో నలు వైపులా దీనిపై విమర్శలు వస్తున్నాయి. హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీశారని, కథలో పస లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై విమర్శలు చేసిన వారి జాబితాలో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసి, ఆయన తల్లిని దూషించి వార్తల్లోకి ఎక్కింది. తరచూ యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె లైగర్ సినిమాకు రివ్యూ ఇవ్వడంతో అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలు సినిమాలో స్టోరీ ఏమీ లేదని, దీని కోసం ఎందుకు అంతలా హైప్ క్రియేట్ చేశారని ఆమె మండి పడింది.

ముఖ్యంగా గతంలో సినిమా బృందం లైగర్‌కు ముందు, లైగర్‌కు తర్వాత అని అన్నారని అంతలా సినిమాలో ఏం ఉందని ప్రశ్నించింది. ఈ సినిమా కంటే కార్తికేయ-2 బాగుందని చెప్పింది. పూరి సినిమాలలో కంటెంట్ ఉండట్లేదని, అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు డేట్లు మాత్రం కావాలని అడుగుతారని ఫైర్ అయింది. మనకు ఇలాంటి ఏడుపులు అవసరమా అంటూ కామెంట్లు చేసింది.

Tags: actress, comments, liger, movie, sri reddy, Vijay Devarakonda, viral