టాలీవుడ్ లో సాయి పల్లవి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు సినిమా సినిమాకు పాపులారిటీ పెంచుకుంటూ వచ్చింది. ఫైనల్ గా లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ ని కూడా సొంతం చేసుకుంది. గ్లామర్ షోకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వని సాయి పల్లవి తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. అయితే సాయి పల్లవి ఈమధ్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
ఈ క్రమంలో Sai Pallavi ఓ రిస్క్ డెశిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లో ఒక 10 నిమిషాల రోల్ కోసం సాయి పల్లవి సైన్ చేసిందట. పుష్ప 2లో ఒక గిరిజన మహిళ పాత్రలో సాయి పల్లవి కనిపిస్తుందట. ఈ పాత్ర కోసం డిజైన్ చేసిన విధానం చూసిన సాయి పల్లవి కెరియర్ రిస్క్ లో పెట్టి మరి ఓకే చెప్పింది. స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ టైం లో ఇలా చిన్న పాత్రలు చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.
మరి ఆ విషయంలో Sai Pallaviకి ఎలాంటి ఇబ్బంది లేదనిపిస్తుంది. అందుకే ఆమె పుష్ప 2 కోసం సైన్ చేసింది. పుష్ప 2 సినిమాలో రష్మిక పాత్ర ఎండ్ అవుతుందని. సాయి పల్లవి పాత్ర సూపర్ గా ఉంటుందని అంటున్నారు.