ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal ) సినిమాల లెక్క ఎలా ఉన్నా తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో మాత్రం అదరగొడుతుంది. లేటెస్ట్ గా సైమా అవార్డుల్లో నిధి గ్లామర్ ఎటాక్ మాములుగా లేదు. అమ్మడి అందాలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. సైమా అవార్డ్ వేడుకల్లో నిధి అగర్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. యద అందాలు కనిపించేలా నిధి గ్లామర్ షో ఈవెంట్ కే ప్రత్యేక అందాన్ని తెచ్చింది.
చేతిలో పెద్దగా సినిమాలు లేకున్నా సరే అమ్మడు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా అమ్మడికి అంత గొప్ప ఆఫర్లు ఏమి లేవు. అయితే నిధి అగర్వాల్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది.
పవన్ సినిమాతో అయినా అమ్మడి ఫేట్ మారుతుందేమో చూడాలి. Nidhi Agarwal తన క్రేజ్ ని పెంచుకునేలా హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. యువ హీరోల సరసన కూడా నటించేందుకు ఓకే అంటున్న నిధి సినిమాలో గ్లామర్ షో కూడా చేసేందుకు రెడీ అంటుంది.