ఆ న‌టుడితో ముదురు ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా డేటింగ్‌… ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షిసిన్హా రీసెంట్‌గా ద‌హాద్ వెబ్‌సీరిస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం సంజ‌య్ లీలా బ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్న వెబ్‌సీరిస్ హీరామండిలోనూ క‌నిపించ‌నుంది. స‌ల్మాన్ ఖాన్ ద‌బాంగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆమె ఉత్త‌మ తొలిచిత్ర న‌టిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. త‌ర్వాత రౌడీ రాథోడ్ లాంటి సినిమాలో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది.

రీసెంట్‌గా జూన్ 2న సోనాక్షి త‌న 36వ పుట్టిన రోజు జ‌రుపుకుంది. అయితే ఈ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంతోమంది సెల‌బ్రిటీలు ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఆమె స‌హ‌న‌టుడు జ‌హీర్ ఇక్బాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీరిద్ద‌రు ఇప్ప‌టికే డేటింగ్‌లో ఉన్నార‌న్న రూమ‌ర్లు కూడా బీటౌన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ పుకార్లు ఎంత వైర‌ల్ అవుతున్నా వీటిపై జ‌హీర్‌, సోనాక్షి మాత్రం ఎప్పుడూ నోరు విప్ప‌లేదు.

దీనికి తోడు వీరిద్ద‌రు ప్ర‌తిసారి చాలా ఈవెంట్స్‌లో క‌నిపిస్తూ ఉండ‌డంతో వీరి రిలేష‌న్‌పై జాతీయ మీడియాలో సైతం పుంకాను పుంకాలుగా వార్త‌లు వ‌స్తూ ఉంటాయి. తాజాగా సోనాక్షి బ‌ర్త్ డే సంద‌ర్భంగా జ‌హీర్ చేసిన పోస్టుతో ఇప్పుడు వీరి బంధంపై మ‌రింత బ‌ల‌మైన ఊహాగానాలు న‌డుస్తున్నాయి. ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెపుతూనే ఐల‌వ్ యూ అంటూ రాసుకు వ‌చ్చాడు.

అంతే కాకుండా ఆమెతో దిగిన ఫొటోల‌ను కూడా త‌న ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేశాడు. గ‌త నెల‌లో స‌ల్మాన్ సోద‌రి అర్పితా ఖాన్ వీరిద్ద‌రి రిలేష‌న్‌ను అధికారికంగా బ్రేక్ చేశారు. వీరిద్ద‌రు క‌లిసి డ‌బుల్ ఎక్స్ఎల్ సినిమాలో న‌టించారు. ఇక సోనాక్షి ఇప్పుడు అక్ష‌య్‌కుమార్‌, ట్రైగ‌ర్ ష్రాప్ సినిమాల‌తో పాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంటోంది.