శ్రీ లీలకు భారీ షాక్ ఇచ్చిన ప్రభాస్… ఇది మాత్రం ఎవరు అసలు ఊహించలేదుగా..!

ప్రస్తుతం తెలుగులో సెన్సేషన్ గా మారిన హీరోయిన్లలో శ్రీ లీల ముందు వరుసలో ఉంటుంది.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత రవితేజకు జంటగా ధమాకా సినిమాలో నటించి తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో శ్రీ లీల క్రేజ్ ఒకసారిగా మారిపోయింది.

వరుస క్రేజీ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. స్టార్ హీరోల‌ నుంచి యంగ్ హీరోల వరకు శ్రీలీల‌ని తమ సినిమాలో హీరోయిన్గా కోరుకుంటున్నారు. ప్రస్తుతం పది సినిమాలకు పైగా నటిస్తూ ఎంతో బిజీగా కొనసాగుతుంది. అయితే అలాంటి శ్రీలీలకు ప్రస్తుతం గట్టి షాక్ తగిలినట్టు తెలుస్తుంది.

అసలు విషయం ఏమిటంటే ప్రభాస్- మారుతి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో మొన్నటి వరకు శ్రీ లీలను హీరోయిన్గా అనుకున్నారు.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీలను కాకుండా నీధి అగర్వాల్ లను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారని అంటున్నారు. శ్రీ లీలకు ప్రభాస్ కావాలని నో చెప్పారని అంటున్నారు. ఇక దీంతో శ్రీలీలకు ప్రభాస్ గట్టి షాక్ ఇచ్చాడనే చెప్పాలి.