గులాబీ టీతో ఇన్ని ఉప‌యోగాలా… ఎలా త‌యారు చేస్తారో తెలుసుకోండి…!

మీకు టీ అంటే ఇష్టమా.. అయితే తప్పకుండా రోజ్ టి తాగండి. గులాబీ పూలతో ఈ టీ తయారు చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజు ఈ గులాబీ టీ తాగితే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అలాగే రోజ్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గులాబీ టీ వల్ల ప్రయోజనాలు ఏంటో ? దీన్ని ఎలా ? తయారు చేసుకోవాలో చూద్దాం.

ఈ టీ తాగడం వల్ల మూడ్‌ రీ ఫ్రెష్ చెయ్యడమే కాకుండా బరువును కూడా సమతూకంలో ఉంచుతుంది. గ్రీన్ టీ మాత్రమే కాదు.. రోజ్ టీ కూడా బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గులాబీ రేఖలతో తయారు చేసిన ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్ల‌మేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీకు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ కాలంలో ప్రతి క్షణం ఏదో ఒక కారణంతో ఒత్తిడికి గురవుతూ ఉంటాము.

మన టెన్షన్ల నుంచి విముక్తి కలిగించడానికి కూడా రోజ్ టీ బాగా సహాయపడుతుంది. ఈ టీ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శక్తి పెంచడంలో బాగా సహాయపడుతాయి. కాబట్టి దీనిని ఉదయం తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. గులాబీ టీ ఎలా ?తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

గులాబీ టీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
కొన్ని పొడి గులాబీ రేఖలు, ఒక గ్లాస్ నీళ్లు అలాగే రుచికి తగినంత తేనే లేదా చక్కెర వేసుకోవాలి. టీ ఆకులు కొన్ని, గులాబీ రేకులు.. కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి, ఆ తరువాత ముందుగా ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో గులాబీ రేఖలను వేసి రంగు మ‌రిగేవరకు మరిగించాలి. ఆ తరువాత దీనిలో రోజ్‌ ఎసెన్స్, టీ ఆకులు వేసి, స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఐదు నిమిషాల పాటు మూత పెట్టి తేనె, పుదీనా మిక్స్ చేయాలి. ఇలా చేసినట్లయితే రుచికరమైన టీ తయారవుతుంది. మీకు కావాలంటే దాల్చిన చెక్క వేసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఈ టీ తాగినట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయినా కొలెస్ట్రాల్, బరువు తగ్గడం, ప్లేట్ లైట్స్ తగ్గకుండా సహాయపడుతుంది.