సినీ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకొని టాప్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటులు వీళ్లే..?

నటించే భాష ప్రాంతానికి సరిపోయే విధంగా చాలామంది స్టార్ హీరోలు ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా తమ పేర్లను స్క్రీన్ టైటిల్ కార్డ్స్ పై మార్చి పెట్టుకున్నారు. అలా పలువురు దర్శకులు సెట్‌లోనే హీరో హీరోయిన్లకు కొత్త పేర్లు సూచించడం కూడా జరిగింది. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పలుచోట్ల పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అసలు పేర్లను మార్చుకుని దశాబ్దాలుగా ఇండ‌స్ట్రీ ని ఏలుతూ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న నటులు ఎవరో ఒకసారి చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి :
చిరంజీవి అసలు పేరు కొణిదల శివశంకర వరప్రసాద్. ప్రేక్షకుల్లో క్యాచీగా ఉండడానికి షార్ట్ అండ్ స్వీట్ గా ఉండడం కోసం చిరంజీవిగా ఆయన పేరును మార్చుకున్నారు. నిజానికి అది బాగా సెట్ అయింది. ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా చిరంజీవి రికార్డ్స్ సృష్టించాడు.

పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదల కళ్యాణ్ బాబు కానీ అన్నయ్య లాగే క్యాచీగా ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ గా స్క్రీన్ నేమ్ ని మార్చుకున్నారు. అభిమానులు పవర్ స్టార్ లేదా గబ్బర్ సింగ్ అంటూ పిలుస్తారు. ఈయన కూడా సినీ రంగంలో ఎన్నో సంచలనాలను సృష్టించాడు.

రజినీకాంత్ :
తెలుగుతోపాటు, మలయాళీ, తమిళ్ ఇలా ఎన్నో భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. కండక్టర్గా పనిచేసే రోజుల్లో ఈయన పేరు అదే తర్వాత మరాఠీ పేరు నుంచి మారి తమీలియన్గా రజినీకాంత్ పేరుకు షిఫ్ట్ అయ్యాడు.

ధనుష్ :
రజనీకాంత్ మాజీ అల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. అతడికి సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సార్ల పేర్లు ఉన్న పేరు మార్చుకుని ధనుష్ గా నామకరణం చేసుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ధనుష్.

నయనతార :
ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న నయనతార పేరు డయానా మరియం కురియన్. ఈ పేరుని కేవలం సినిమా ఇండస్ట్రీ కోసమే కాక తన మతాన్ని క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలో నుంచి మార్చుకునేందుకు కూడా మార్చుకుందట‌.

సూర్య శివకుమార్ :
యాక్టర్ సూర్య అసలు పేరు శరవన్ శివకుమార్. కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించడానికి పేరు సహాయపడుతుందని నమ్మిన సూర్య తన పేరును సూర్య శివ‌కుమార్ గా మార్చుకున్నాడు. ఇతడు సౌత్ ఇండియాలోనే కాక కొలివుడ్ లోను ఎన్నో హిట్ సినిమాలు నటించి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

చియాన్ విక్రమ్ :
కెనడా స్టార్ హీరోస్ చియాన్ విక్రమ్ ఇండస్ట్రీలో పాపులర్ స్టార్ లో ఒకడు. రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించిన ఓ సినిమాకు సౌందర్య కీ రోల్‌ ప్లే చేసింది. ఈ సినిమాతో యాక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమై రూ.1500 మొదటి పారితోషికాన్ని అందుకున్నాడు విక్రమ్. సౌత్ ఇండియాలోనే పెద్ద స్టార్ హీరో అయినా ఇతని అసలు పేరు ఎవరికీ తెలియదు.

సౌందర్య :
అతనటి సౌందర్య టాలీవుడ్ లో ఎటువంటి ముద్ర వేసుకుందో అందరికీ తెలిసిందే. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ.

సిల్క్ స్మిత :
ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కురాఫ్ అడ్రస్ గా నిలిచిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. స్వస్థలం విజయవాడ.

భావన మీనన్ :
బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ భావన మీనన్ అసలు పేరు కార్తీక మీనన్. ఈ పేరును భావనగా మార్చుకోవడం వల్ల తెరపై మరింత స‌క్స‌స్‌ సాధించింది.