నిద్ర అంటే అందరికీ ఇష్టమే. కానీ కొందరు నిద్రలో గురక పెడుతూ ఉంటారు. గురక రావడానికి కారణం మనం పడుకున్నప్పుడు నోటితో శ్వాస పీల్చడం. గురక పెట్టే వారికి ఆ ఇబ్బంది తెలియదు కానీ.. వాళ్ల పక్కన ఎవరైనా పడుకోవాలంటే చిరాకు పడుతూ ఉంటారు. చాలామందికి అదో అలవాటుగా మారిపోతుంది. అయితే గురకను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
• గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు పేప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి… రాత్రి నిద్రపోయే ముందు నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి.
• ఆహారంలో నెయ్యిని ఉపయోగిస్తే మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను ఫ్రీ చేసి గురకను తగ్గిస్తుంది.
• నిద్రపోయే ముందు అర టీస్పూన్ యాలకుల పౌడర్ వేడి నీటిలో కలిపి తాగడం వల్ల గురక అదుపులో ఉంటుంది.
• బరువును మేనేజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి.
• పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
•నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేసినట్లయితే మీ గురక తక్షణమే మాయమైపోతుంది.