నీతోనే డాన్స్ షో చాలా రసవత్తంగా సాగుతుంది. పర్ఫామెన్స్ చూసి ఆడియన్స్ తో పాటు జడ్జెస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ ,అంజలి చేసిన పర్ఫామెన్స్ చూడలేక సదాకి గుండె ఆగినంత పని అయింది. నీతోనే డాన్స్ షో ఈవారం ప్రోమో అదిరిపోయింది. అసలే ఫినాలి దగ్గరికి రావడంతో జోడీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇక తాజా ప్రోమో అయితే రచ్చ రచ్చ చేసింది. ఈవారం ఎపిసోడ్లో సదా ఎక్స్ప్రెషన్స్ నటరాజ్ మాస్టర్ ఫైట్ ప్రోమోనీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి.
ఆట సందీప్, జ్యోతి జోడిగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. వీళ్ళకి అమర్దీప్ 5 మార్కులు ఇవ్వడంతో రచ్చ జరిగింది. వదిన నువ్వు స్లిప్ అయ్యావు అంటూ జ్యోతితో అమర్ చెప్పాడు. జ్యోతి నేను అవ్వలేదు అంటూ అబద్ధం ఆడటంతో లేదు వదినా నిజంగానే నువ్వు స్లిప్ అయ్యావంటూ అమర్దీప్ చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన సందీప్ అమర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటివారం 6 ఇచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు ఒక మార్కు తగ్గించడంతో ఎదవలం అయిపోయామ అంటూ అమర్దీప్ మాటకు మాట చెప్పాడు.
నేను గోల్డెన్ సీట్ కోసం రాలేదు.. ఫైనల్ లో నేను ఏంటో చూపిస్తానంటూ సందీప్ ఛాలెంజ్ చేయడంతో అమర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. నాకు డాన్స్ అంటే.. ఎంత ఇష్టమో డాన్స్ తోనే చూపిస్తాను అని సందీప్ అన్నాడు. దానికి అమర్ సందీప్ మాస్టర్ ఇక్కడే చనిపోతే నేను కూడా ఇదే స్టేజి మీద డాన్స్ కోసం ప్రాణాలు ఇస్తాను అంటూ ఇద్దరూ పోటా పోటీగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అసలు షోలో అందరి మధ్య పుల్లలు పెట్టే శ్రీముఖికి నటరాజ్ మాస్టర్ ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు.
నటరాజ్ నీతు జోడి అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత శ్రీముఖి పుల్లలు పెట్టింది.
ఎలా అనిపించింది మాస్టర్ సొంత బయోపిక్ చేయడం నాకెందుకు ఆ క్యారెక్టర్ ప్లేస్ లో అంజలిని పెట్టుంటే ఎంతో బాగున్ను అనిపించింది అంటూ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేటందుకు ట్రై చేసింది. ఎంతమందికి గొడవలు పెడతావు నువ్వు నీకు అసలు నా ఒక్కడి విషయంలో అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటూ నటరాజ్ మాస్టర్ శ్రీముఖిపై ఫైర్ అయ్యారు. ఇక ప్రోమో చివర్లో పవన్, అంజలి జోడి సదాని భయపెట్టి ఉలిక్కిపడేలా చేసింది. ప్లీజ్ ఇలా చేయొద్దు… ఇది చాలా సెన్సిటివ్ మేటర్… దయచేసి నేను మిమ్మల్ని బుక్ చెయ్యను… అంజలి ప్లీజ్ గో…. నేను చెబుతున్నాను ప్లీజ్ గో… అంటూ సదా ఫైర్ అయ్యింది.