రౌడీ హీరోకు ఇబ్బందిగా మారిన సమంత కాల్షీట్లు.. ఖుషీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కేనో

అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్‌కు పాకింది. దీంతో విజయ్-అనన్యపాండేతో జంటగా దర్శకుడు పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమాగా ‘లైగర్’ను తెరకెక్కించారు. దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్రలో నటించారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ ఎందుకో ఈ సినిమా ఆశించిన విజయం దక్కలేదు. దీంతో ఆయన తరువాత సినిమాలపై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా ఖుషీ పేరుతో సమంత హీరోయిన్‌గా, విజయ్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి పోస్టర్ కూడా విడుదలైంది. పూరి జనగణమన సినిమాను విజయ్‌ హీరోగా పెట్టి ఒక షెడ్యూల్ తీశాడు. లైగర్ దెబ్బతో ఆ సినిమా ప్రస్తుతం అటకెక్కింది. ఇక ఖుషీ సినిమా అయినా రెగ్యులర్‌గా తెరకెక్కుతుందని అనుకుంటే దానికి సమంత రూపంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

విడాకుల తర్వాత సమంత సినిమాలలో బాగా బిజీ అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాకు కూడా ఆమె ఎంపికైంది. వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు. సమంత జర్నలిస్టుగా, విజయ్ ఫొటోగ్రాఫర్‌గా చక్కటి నటన కనబర్చారు. ఈ జోడీ మరోసారి జంటగా నటిస్తుండడంతో ఖుషీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగకపోవడానికి సమంత డేట్స్ ఖాళీగా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. సమంత వరుస ప్రాజెక్టులతో ప్రస్తుతం తీరిక లేకుండా ఉంది. దీంతో హీరో విజయ్‌తో పాటు దర్శకుడు శివ నిర్వాణ అయోమయంలో పడ్డారు. సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు చిత్రీకరణను ఎప్పుడో పూర్తి చేసుకున్నాయి.

ప్రస్తుతం ఆ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం సమంత ఏం చేస్తుందే ఎవరికీ తెలియని పరిస్థితి. వరుస అవకాశాలు వస్తున్నాయని అంతా అనుకుంటున్నారు కానీ ఎందుకు ఖుషీ సినిమాకు డేట్లు కేటాయించలేక పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక విజయ్‌కు ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇది మంచి హిట్ అందుకుంటే విజయ్ బాలీవుడ్ రేసులో ఉంటాడు. లేకుంటే అతడి భవిష్యత్తు అయోమయంలో పడడం ఖాయం. అందుకే సమంత కాల్షీట్ల సమస్య విజయ్‌కు ఇబ్బందికరంగా మారింది.

Tags: latest news, over, Samantha, troubles, Vijay Devarakonda, viral latest