బాలీవుడ్ సీరియల్స్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత అక్కడ సినిమాలు చేస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే సూపర్ హిట్ ఆమె ఖాతాలో వేసుకుంది. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది. సినిమాలో ఆమె ఎంత క్యూట్ గా నటించిందో అందరికి తెలిసిందే. సీతారామం సినిమాలో సీత పాత్రలో ఆమెని తప్ప మిగతా ఎవరిని ఊహించుకోలేం అని చెప్పొచ్చు.
ఇక ఇదిలాఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన డ్రీం బోయ్ గురించి చెప్పింది మృణాల్ ఠాకూర్. తన మనసుని అర్ధం చేసుకుని తను ఏం ఆలోచిస్తున్నానో కూడా తను అర్ధం చేసుకునే వాడు తనకు భర్తగా కావాలని అన్నది మృణాల్. అయితే అలాంటోడు దొరికినా దొరకకపోయినా సరోగసి విధానం ద్వారా పిల్లలని కనాలని ఉందని అన్నది. డ్రీం బోయ్ దొరక్కపోతే మదర్ థెరిసా లాగా అయినా ఉండిపోతానని అంటుంది మృణాల్.
Mrunal Thakur స్టేట్ మెంట్స్ కి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఈ కామెంట్స్ తోనే ఆమె మనసు ఎంత నిర్మలమో అర్ధమవుతుంది. మొత్తానికి మృణాల్ ఠాకూర్ తన పెళ్లి, పిల్లలపై ఓ పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉందని మాత్రం చెప్పొచ్చు. తెలుగులో సీతారామం తర్వాత ఆమెకి ఒకటి రెండు స్టార్ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది.