సూపర్ స్టార్ మహేష్ జీ తెలుగుతో ఏడాది పాటు డీల్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. జీ తెలుగులో వచ్చే రియాలిటీ షోస్, సీరియల్స్ ని ప్రమోట్ చేసేలా Mahesh తో దాదాపు 9 కోట్ల దాకా డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మహేష్ ని వాడటం మొదలు పెట్టారు. మహేష్ ఇప్పటికే జీ తెలుగులో వస్తున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చి అలరించారు. ఆ షో మహేష్ రావడం వల్ల టి.ఆర్.పి రేటింగ్ పెరిగింది. ఆదివారం ఓ పక్క బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వస్తున్నా సరే మహేష్ కోసం ఆ షో చూశారు ఫ్యాన్స్.
ఇక ఇదే కాకుండా ఇప్పుడు సీరియల్స్ లో కూడా మహేష్ కనిపిస్తారని తెలుస్తుంది. దానికి సంబందించిన పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ తో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకున్న జీ తెలుగు మరీ దారుణంగా సీరియల్స్ లో కూడా వాడేస్తున్నారంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Mahesh తో పాటుగా సితార కూడా డ్యాన్స్ షోలో పాల్గొన్నది. ఇప్పుడు సీరియల్ లో కూడా సితార కనిపిస్తుందని తెలుస్తుంది. మహేష్ సితార ప్రెజెన్స్ తో జీ తెలుగు షోలకు, సీరియల్స్ కి కొత్త కలర్ వచ్చింది. ఇక ఈ క్రేజ్ తోనే జీ తెలుగు సీరియల్స్ కి మరింత ఫాలోయింగ్ పెరిగే ఛాస్ ఉంటుందని చెప్పొచ్చు.