Mrunal Thakur : సీతగా చూసిన ఆమెను అలా చూసి తట్టుకోగలరా..!

రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). దుల్కర్ సల్మాన్ తో జోడీ కట్టిన ఈ బాలీవుడ్ భామ తెలుగులో అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రల్లో మృణాల్ ఠాకూర్ తన సత్తా చాటింది. సినిమా హిట్ లో ఆమె కూడా ఒక భాగమని చెప్పొచ్చి. ఇక విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ అయింది.

హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సీతారామం సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత మృణాల్ (Mrunal Thakur) కి తెలుగులో భారీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె బాలీవుడ్ లో ఒక వెబ్ సీరీస్ చేస్తుందని తెలుస్తుంది. అది అడల్ట్ కంటెంట్ తో వస్తుందని టాక్. లస్ట్ స్టోరీస్ 2 లో మృణాల్ నటిస్తుందని అంటున్నారు.

లస్ట్ స్టోరీస్ అంటే అప్పట్లో కియరా చేసిన హాట్ ఎక్స్ ప్రెషన్స్ గుర్తుకొస్తాయి. మరి మృణాల్ కూడా అలా రెచ్చిపోతుందా తెలుగులో ఆమెని ఎంతో మంచి పాత్రలో చూసిన ఆడియెన్స్ లస్ట్ స్టోరీస్ లో ఆమెని అలా చూసి తట్టుకుంటారా లేదా అన్నది చూడాలి.

Tags: Dulquer Salman, Lust Stories, Mrunal Thakur, netflix, Sithamahalakshmi, Sitharamam, Web Series