Brahmastra : ఎన్టీఆర్ గెస్ట్ గా బ్రహ్మాస్త్రం ఈవెంట్..!

రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర (Brahmastra). ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తెలుగులో ఈ మూవీని రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాకి గ్రాడ్ ఒపెనింగ్ తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజమౌళి తన ప్రమోషన్ స్ట్రాటజీలను బ్రహ్మాస్త్రకి వాడుతున్నట్టు తెలుస్తుంది. అందుకే బ్రహ్మాస్త్ర (Brahmastra) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తున్నారట. తారక్ వస్తే నందమూరి ఫ్యాన్స్ అండదండలు ఉన్నట్టే. బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్ లాంటి మన సినిమాలని హిందీ ఆడియెన్స్ ఇష్టపడినట్టుగా బ్రహ్మాస్త్ర ని తెలుగు ఆడియెన్స్ కూడా చూడాలని మేకర్స్ చెబుతున్నారు.

సినిమాలో విషయం ఉంటే అది ఏ భాషకి సంబందించిన సినిమా అయినా సరే తెలుగు ఆడియెన్స్ హిట్ చేస్తారు. ఈ సినిమాలో నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సినిమాలో ఆయన పాత్ర కూడా హైలెట్ అవుతుందని అంటున్నారు.

Tags: Alia Bhatt, Ayan Mukharji, Bollywood, Brahmastra, ntr, rajamouli, Ranbhir Kapoor