మళయాళ భామ నిత్యా మీనన్ అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం. అలా మొదలైంది సినిమా తో మొదలైన నిత్యా టాలీవుడ్ (Nitya Menon) కెరియర్ అనతి కాలంలోనే అభినయ తారగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గ్లామర్ షోకి దూరంగా నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు దగ్గరగ తన సత్తా చాటుతూ వచ్చిన నిత్యా మీనన్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. నిత్యాకి పొగరు ఎక్కువని.. ఆమె తల బిరుసుగా ప్రవర్తిస్తుందని.. ఎవరైనా ఏదైనా అడిగినా సరే పొగరుగా సమాధానం చెబుతుందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై ఇన్నాళ్లు స్పందించని నిత్యా మీనన్ (Nitya Menon) లేటెస్ట్ గా వాటిపై స్పందించింది. ఇండస్ట్రీలో తనకు చాలామంది శత్రువులు ఉన్నారని. తన ఎదుగుదల చూసి ఓర్వలేని వారే తన మీద ఇలాంటి నెగటివ్ ప్రచారం చేయించారని. తనతో మాట్లాడకుండానే తన మీద నెగటివ్ ప్రచారం చేశారని అన్నది నిత్యా మీనన్.
తన మీద ఎన్ని రూమర్స్ వచ్చినా సరే తాను ఎలాంటి దాన్ని అన్నది తనకు తెలుసని.. అందుకే ఇప్పటివరకు ఏ విషయం గురించి తను గొడవ చేయలేదని అన్నది. అంతేకాదు తనతో నటించిన వారందరికి తన గురించి బాగా తెలుసని చెప్పుకొచ్చింది నిత్యా మీనన్.