దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామన్ సినిమాలో కొన్ని లాజిక్ లేని సీన్లు ఉంటాయి కానీ ఇందులో ఉండే రెండు ట్విస్ట్స్ మాత్రమే బాగా ఎంటర్టైన్ చేస్తాయి. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఒక అందమైన ప్రేమ కావ్యం లాగా అనిపిస్తుంది. ఇందులో కొన్ని బోరింగ్ సన్నివేశాలు కూడా ఉంటాయి. సినిమాలో చాలా సన్నివేశాలు అవసరం లేదని, వాటిని ఎడిటింగ్ చేస్తే సరిపోతుందనే ఫీలింగ్ కూడా వస్తుంది.
గత నెల రిలీజైన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఓటీటీలో ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ సినిమాని మూవీ లవర్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది దీనిని చూసేలా టెంప్ట్ చేసేందుకు ఓటీటీ సంస్థ అమెజాన్, మూవీ ప్రొడక్షన్ యూనిట్ కలిసి సినిమాలోని వీడియో సాంగ్స్, డిలీటెడ్ సీన్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మరో డిలీటెడ్ సీన్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
నిజానికి ఈ సినిమాలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో టాలీవుడ్ యాక్టర్, గోదావరి మూవీ ఫేమ్ సుమంత్ నటించాడు. సినిమా మొదటి సన్నివేశం మొదలు చివరి సన్నివేశం వరకు విష్ణు శర్మ (సుమంత్)కు లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్) అంటే నచ్చదు. వీరి మధ్య శత్రుత్వం ఉన్నట్లు చూపించలేదు కానీ అసూయ ఉన్నట్టు చూపించారు. అయితే సినిమా ప్రీ-క్లైమాక్స్‌లో వారిద్దరూ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కుతారు. అప్పుడు పాక్ ఆర్మీ రామ్, విష్ణు శర్మని చిత్ర హింసలకు గురిచేస్తారు. అయితే ఒక పాక్ అమ్మాయిని కాపాడినందుకే వారికి ఈ దురవస్థ పడుతుందని పాకిస్థాన్ ఆర్మీ జనరల్ తారిఖ్ (రష్మిక తాత) తెలుసుకుంటాడు.
అలాంటి మంచి వారిని ఇండియా పంపించడానికి తన వంతు కృషి చేస్తాడు. ఆ సమయంలో రామ్, విష్ణు శర్మలో ఎవరో ఒకరినే పంపించాలని పాక్ ఆర్మీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక గొడవ జరిగినట్లు డైరెక్టర్ చిత్రీకరించాడు. ఆ గొడవ కూడా ఉంటే సినిమా బాగా సాగదీసినట్లు అవుతుందని దానిని డిలీట్ చేశాడు. దాంతో థియేటర్‌కి వెళ్లిన వారు, ఇప్పుడు ఓటీటీలో సినిమా చూస్తున్న వారు ఆ సీన్ చూడలేకపోయారు. కాగా ఇప్పుడు ఆ సన్నివేశాన్ని యూట్యూబ్ వేదికగా మూవీ బృందం షేర్ చేసింది. దీనిని చూసిన ప్రేక్షకులు ఈ సీన్ కూడా చాలా బాగుందని, ఈ సన్నివేశాలు చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నానని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ డిలీటెడ్ వీడియాలో రామ్, విష్ణు శర్మ బయటికి వచ్చి ఫుట్‌బాల్ ఆడటం గమనించవచ్చు. విష్ణు శర్మ గెలవడంతో.. రామ్.. ఈసారి కూడా మీరే గెలిచారని చెప్పడంతో విష్ణు శర్మ చాలా కోప్పడతారు. రామ్ కాలర్ పట్టుకొని.. “నేనెక్కడ గెలిచానురా.. అంతా నీ వల్లనే జరిగింది.. నువ్వు అనాథవు రా.. నాకు ఫ్యామిలీ ఉందిరా” అంటూ ఫైర్ అవుతాడు. ఈ వీడియో చూసేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి. లేదంటే వైజయంతి నెట్‌వర్క్(Vyjayanthi Network) యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి.