నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో బ్లాక్ బ్లస్టర్ సినిమాలో నటించాడు. బాలకృష్ణ కేవలం ఒకే టైప్ పాత్రలలో నటించకుండా వివిధ రకాల పాత్రలో నటించి ప్రేక్షకులను అలరిస్తుంటాడు. రొమాంటిక్ చిత్రలతో పాటు, మాస్ యాంగిల్, జానపద చిత్రలో కూడా నటించాడు.
బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలో ‘భైరవద్వీపం’ సినిమా కూడా ఒకటి. ఈ జానపద చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్య నటన మరువలేనిది. బాలకృష్ణ ఈ సినిమాలో కుష్టివాడిలా, ఒక కురూపిగా నటించిన విషయం తెలిసిందే. కుష్టివాడి పాత్ర కోసం బాలయ్య చాలా కష్టపడారట. ఆ గెటప్‌లో నటించినన్ని రోజులు బాలయ్య పది గంటలవరకు భోజనం చేయకుండా ఉండేవారట. ఎందుకంటే గెటప్ కోసం వేసుకున్న మేకప్ భోజనం చేయడానికి అడ్డొచ్చేదట. అయినా కూడా ఆ మేకప్ అలాగే ఉంచుకుని భోజనం చేయకుండా జ్యూస్‌లతోనే కడుపు నింపుకునేవాడట.
ఇదంతా బాలయ్యకు కొత్తేమీ కాదు. ఈ నందమూరి నటసింహం తన సినిమాల కోసం ఎప్పుడూ కూడా చాలా కష్టపడతారు. డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేస్తుంటారు. బాలయ్య సినిమా షూటింగ్ జరిగే సమయంలో అందరికంటే ముందే వస్తారని ఆయనతో కలిసి నటించిన నటీనటులు చెప్తుంటారు. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ఎంత క్రమశిక్షణతో వుంటారో.. అలానే బాలయ్య క్రమశిక్షణతో నడుచుకుంటాడని అంటూ ఉంటారు. ప్రస్తుతం బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు.