తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేసి అదరగొట్టిన ఐశ్వర్యరాయ్.. ఆ మూవీపై ఇంటరెస్టింగ్ కామెంట్స్!

మణిరత్నం డైరెక్ట్ చేసిన భారీ బడ్జెట్ మూవీ పొన్నియన్ సెల్వన్-1 సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు వంటి స్టార్స్‌తో పాటు చాలామంది పాపులర్ యాక్టర్స్ నటించారు. అందులోనూ ఇది ఫాంటసీ సినిమా అని చెబుతుండటంతో దీనిపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లేందుకు మూవీ బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న మూవీ యూనిట్ హైదరాబాద్ విచ్చేసింది. ఈ సందర్భంగా మిస్ వరల్డ్, అందాల బొమ్మ ఐశ్వర్య రాయ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చింది. “మీ అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేసి స్టేడియం మొత్తంతో చప్పట్లు కొట్టించుకుంది.

మణిరత్నం టీమ్‌తో కలిసి పని చేసినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారని, ఈ మూవీ ఒక అద్భుతమైన పెయింటింగ్‌లా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ ఈవెంట్‌లో ఐశ్వర్య చక్కటి ఎంబ్రాయిడరీ గల రెడ్ కలర్ కుర్తాలో కనిపించింది. ఆమె అందమైన రూపం ఎవరి కళ్లను తిప్పుకోలేనంతగా కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మ తన స్పీచ్‌లో మూవీ క్రూ అండ్ కాస్ట్‌ని మెన్షన్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపింది. అలాగే వారి పనితనాన్ని మెచ్చుకుంది. పొన్నియిన్ సెల్వన్ కథ కొంత కల్పితం కాగా మిగతాది నిజ జీవిత రాజులు, సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా స్టోరీ క్రీస్తుశకం 900-950 మధ్య జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. సింహాసనం కోసం ఆయా రాజులు ఎలా పోటీపడతారో చెప్పే కథ ఇది అని తెలుస్తోంది.

ది గ్రేట్ డ్రామా గతం కల్కి కృష్ణమూర్తి ప్రసిద్ధ చారిత్రక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్, కార్తీ, ఐశ్వర్య రాయ్ యాక్టింగ్ ఇందులో హైలెట్ కానున్నాయి. అరుణ్మోళి వర్మన్ అకా పొన్నియిన్ సెల్వన్‌గా (పొన్నియిన్ కుమారుడు) “జయం” రవి నటించగా.. క్రౌన్ ప్రిన్స్‌ ఆదిత్య కరికాలన్‌గా “చియాన్” విక్రమ్ నటించాడు. త్రిష యువరాణి కుందవై, కార్తీ యువరాజు వంతీయతేవన్.. ఐశ్వర్యరాయ్ యువరాణి నందిగా నటించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో థియేటర్లలోకి రానుంది.

Tags: Aishwarya Rai, Aishwarya Rai speech, Mani Ratnam, movie release, Ponniyin Selvan, vikram