పిల్లల్లో కడుపు నొప్పి మాయం చేసే సింపుల్ చిట్కా ఇది..!

జీర్ణాశయంలో ఉంటూ నులి పురుగులు మనం తినే ఆహారాన్ని అవే తినేస్తూ ఉంటాయి. చిన్నపిల్లల కడుపులో ఈ నులిపురుగు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నులిపురుగు ఉంటే కడుపు నొప్పి రావడం జరుగుతుంది. ఈ నులిపురుగు కడుపులో ఉండడం వల్ల సరైన పోషక ఆహారం అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఏటా నులిపురుగుల దినోత్సవాలుగా నిర్వహిస్తూ ఆల్బెండజోల్ మాత్రలు కూడా పిల్లలకి అందజేస్తుంది.

హోమియోపతిలో అయితే సినా అనే మెడిసిన్ వాడటం ద్వారా నులు పురుగులు నివారించవచ్చు అంటున్నారు. హోమియోపతి వైద్య నిపుణులు రమణరావు. పిల్లలకి ఎక్కువగా వచ్చే సమస్యల్లో నులిపురుగు ఒకటి. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, ఉడకని కలుషిత ఆహారం వల్ల ఇది ఏర్పడుతుంది. పిల్లల నులుపురుగుల భారి నుంచి తప్పించుకోవడానికి కొన్ని సూచనలు పాటిస్తే తగ్గిపోతాయి.

పిల్లల్లో నులిపురుగు ఒకసారి వస్తే కడుపునొప్పి, పొడి దగ్గు వస్తుంది. దీనిని పోగొట్టడానికి ఇంట్లో వాడే పదార్థాలను ఉపయోగించవచ్చు. ఇంగువ అనేది పిల్లల్లో కడుపు నొప్పిని దూరం చేస్తుంది. ఇంగువను వేడి నీళ్లలో వేసి పిల్లలకు తాగిస్తే నులిపురుగు పట్టకుండా ఉంటుంది. అల్లం , శొంఠి, మిరియాలు, పిప్పలి, తేనెను బాగా కలపి ,ఈ మిశ్రమాలను 15 రోజులు పాటు వాడినట్లయితే నులిపురుగు పూర్తిగా తగ్గిపోతుంది.