వావ్ రెండు క‌ళ్లూ చాల‌వ్‌: బాల‌య్య – చ‌ర‌ణ్ – ప‌వ‌న్ ఒకే వేదిక మీద ( ఫొటోలు)

టాలీవుడ్ హాస్య‌బ్రహ్మ బ్రహ్మానందం రెండ‌వ కొడుకు సిద్ధార్థ క‌న్నెగంటి పెళ్లి ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో హాస్యబ్రహ్మ ఆహ్వానంతో చాలామంది సినీ ప్రముఖులు హాజరై సంద‌డి చేశారు. చాలామంది సినీ ప్రేక్షకులకు తమ ఫేవరెట్ హీరోస్ ని ఒకే వేదికపై చూడాలని ఆసక్తిగా ఉంటుంది. అలాంటివారికి బ్రహ్మానందం కొడుకు పెళ్లి లో హాజరైన స్టార్ హీరోల ఫొటోస్ చాలా ఆనందం క‌లిగించాయి.

ఇక వీరిద్దరి పెళ్లిలో మెరిసిన చాలామంది స్టార్ హీరోస్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్యూటిఫుల్ పిక్స్ చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ వేడుకల్లో నందమూరి నట‌సింహ బాలయ్యతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ హాజరయ్యారు. దీనితో చూడముచ్చటగా ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.