మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. వేణుస్వామి జాత‌కంతో నంద‌మూరి ఫ్యాన్స్‌కు పూన‌కాలే…!

నందమూరి నట‌సింహ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గత 4,5 సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కచ్చితంగా ఎప్పుడు అనే సమాచారం మాత్రం రాలేదు. ఇక తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాట్లాడుతూ మోక్షజ్ఞ గురించి తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తన కుమారుడి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎన్నో విధాలుగా ఆయన ప్రయత్నిస్తున్నాడట. మోక్షజ్ఞ న‌టించబోతున్న మొదటి కథ కావడంతో స్టోరీ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఉద్దేశంలో ఉన్నాడట. గతంలో బాలయ్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిత్య 369 సీక్వెల్ సినిమాలో నేను దర్శకుడిగా.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటు చెప్పుకొచ్చాడు. అఖండ సినిమా టైంలో వేణు స్వామి బాలయ్య కుటుంబంలో కలవడం జరిగింది. బాలయ్య తో పాటు అక్కడ మోక్షజ్ఞను కూడా వేణు స్వామి కలిసినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామిని ఇంటర్వ్యూ యువర్ మోక్ష‌ఙ‌ జాతకం చూశారా అని అడగగా ఎందుకు చూడలేదు చూశాను. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల్లో బాగా రాణిస్తాడు కానీ దాదాపు 2,3 సంవత్సరాల వరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ లేదనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే లేట్ ఎంట్రీ అనుకున్న బాలయ్య ఫ్యాన్స్ కు మరో రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది అని వేణు స్వామి చెప్ప‌డంతో నిరుత్సాహంగా ఫీల్ అవుతున్నారు. మోక్షజ్ఞ సినిమాల్లో బాగా రాణిస్తాడు.. కానీ రాజకీయాలపై ఆసక్తి చూపించడు అంటూ వేణు స్వామి వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతుంది.