రీ రిలీజ్‌లోనూ వ‌ర‌ల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన సింహాద్రి… రీ రిలీజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటే ఇది..!

ఈ రోజు టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో సోష‌ల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రోజు బ‌ర్త్ డే కానుక‌గా ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు దేవ‌ర అనే టైటిల్ పెట్ట‌డంతో పాటు ఎన్టీఆర్ సముద్ర‌పు అల‌ల ఒడ్డున అరివీర భ‌యంక‌రంగా ఉన్న గెట‌ప్‌లో ఉన్న స్టిల్ కూడా బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఇక ఈ రోజు 20 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అస‌లు రీ రిలీజ్ సినిమాల్లో క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో సింహాద్రి స‌రికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్స్‌లో ఇప్ప‌టికే స‌రికొత్త సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన సింహాద్రి ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రీ రిలీజ్ అయిన సినిమాల్లో దిమ్మ‌తిరిగిపోయే రికార్డ్ నెల‌కొల్పింది.

ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏకంగా 1210 షోలు ప‌డుతున్నాయి. ఇది మామూలు రికార్డ్ కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. రీ రిలీజ్ ట్రెండ్లోనే ఇదో స‌రికొత్త బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్లలో సింహాద్రి మాస్ జాత‌ర న‌డుస్తోంది. ఈ సినిమా రీ రిలీజ్ కంప్లీట్ ర‌న్ పూర్త‌య్యే స‌రికి ఇంకెన్ని స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.

Simhadri Telugu Movie Online Watch Full Length HD

వీఎంసీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై వి. దొర‌స్వామి రాజు నిర్మించిన ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆ రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.