మ‌రో వండ‌ర్‌లోకి తీసుకెళ్లిన ‘ ఆదిపురుష్ ‘ జై శ్రీరామ్ సాంగ్.. ( వీడియో)

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ సినిమాలలో ఒకటైన ఆదిపురుష్ పై ఇప్పుడు మరింత ఆసక్తి ఉంది. ఎప్పుడు అయితే పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం భారతీయ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మరి ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

Adipurush - Wikipedia

రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అలాగే, ట్రైల‌ర్ కూడా రీలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి జై శ్రీరామ్ అనే మహిమాన్విత మంత్ర నామాన్ని రిలీజ్ చేశారు. ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన మొదటి సాంగ్ ఫుల్ వెర్షన్ బయటకి వచ్చింది. ఆ సాంగ్ మాత్రం పూర్తిగా మరో లెవెల్లో ఉందని చెప్పడంలో సందేహం లేదు.

ఇది వరకు కేవలం నిమిషం బిట్‌లోనే ఓ రేంజ్‌లో అనిపిస్తే అజయ్ – అతుల్ తమ సంగీత వాయిద్యాలతో ఒక గ్రాండియర్ ట్రాన్స్ జెనరేట్ చేసేశారు. వినడానికే ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. విజువల్ గా ఈ సాంగ్ అదిరిపోంది. వెండి తెర‌పై ఈ సాంగ్ సినిమాలో మమేకం చేస్తుంద‌ని చెప్పడంలో సందేహం లేదు.

Adipurush (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

రామజోగయ్య శాస్త్రి అందించిన‌ సాహిత్యం అజయ్ – అతుల్ సంగీతం ప్రభాస్ ప్రెజెన్స్ ఓం రౌత్ విజన్ తో ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడం ఖాయం. మ్యూజికల్ పరంగా కూడా ఈ సినిమా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.