‘ బిచ్చ‌గాడు 2 ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… టాక్ వీక్‌… క‌లెక్ష‌న్లు ఫుల్‌… కుమ్మి కుమ్మి వ‌దిలిన విజ‌య్‌

పెద్ద‌గా హ‌డావిడి లేదు.. అంత ప‌బ్లిసిటీ కూడా లేదు. పైగా ఆ సినిమాను లీడింగ్‌లో ఉన్న బ‌య్య‌ర్లు కూడా కొనేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. చాలా నార్మ‌ల్‌గా రిలీజ్ అయ్యింది. క‌ట్ చ‌స్తే టాక్ కూడా వీక్‌గానే ఉంది. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు మాత్రం కుమ్మి ప‌డేసింది. అదే బిచ్చ‌గాడు 2 సినిమా. అప్పుడెప్పుడో వ‌చ్చిన విజ‌య్ ఆంటోనీ బిచ్చ‌గాడు సినిమా తెలుగులో పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.

Bichagadu 2 review: రివ్యూ: బిచ్చగాడు-2 | bichagadu 2 review in telugu

20 ఏల్ల క్రితం విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన శీను సినిమా డైరెక్ట్ చేసిన ఐవి. శ‌శి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. త‌మిళ్ మించి తెలుగులో ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు బిచ్చ‌గాడు 2 సినిమాను విజ‌య్ ఓన్‌గా డైరెక్ట్ చేసుకున్నాడు. కావ్య థాప‌ర్ హీరోయిన్‌. సినిమాపై పెద్ద‌గా అంచ‌నాలు లేక‌పోవ‌డంతో ఎవ్వ‌రూ కొనేందుకు కూడా ముందుకు రాలేదు.

వెస్ట్ గోదావ‌రి లోక‌ల్ బ‌య్య‌ర్ ఒక‌రు ఏపీ, తెలంగాణ రైట్స్ రు. 5 కోట్ల‌కు తీసుకుని చాలా త‌క్కువ రేట్ల‌కే ఏరియాల వారీగా ఇచ్చారు. ఇక పెద్ద పెద్ద రేట్లు కూడా తీసుకోలేదు. ఉత్త‌రాంధ్ర రు. 45 ల‌క్ష‌లు, నైజాంలో ఓ కోటి రూపాయ‌ల‌కు అమ్మారు. అయితే తొలి రోజే మైండ్ బ్లాకింగ్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. తొలి రోజే నైజాంలో ఏకంగా రు. 65 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర‌లో రు. 36 ల‌క్ష‌లు రాబ‌ట్టింది.

Bichagadu 2 review: రివ్యూ: బిచ్చగాడు-2 | bichagadu 2 review in telugu

ఇక కృష్ణా జిల్లాలో రు. 19 ల‌క్ష‌లు వ‌చ్చాయి. అస‌లు మ‌హామ‌హా పెద్ద సినిమాల‌కే ఈ రేంజ్‌లో తొలి రోజు వసూళ్లు రాలేదు. స‌రైన టాక్ లేకుండానే ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. అదే బిచ్చ‌గాడు 1కు వ‌చ్చిన టాక్ వ‌చ్చి ఉంటే.. బిచ్చ‌గాడు 2 ఫ‌స్ట్ డే ఏ రేంజ్‌లో వ‌సూళ్లు కొల్ల‌గొట్టేదో లెక్క‌ల‌కే అందేది కాదు. నైజాంలో ఈ సినిమా లాంగ్ ర‌న్‌లోనే రు. 5 కోట్ల రేంజ్‌లో రాబ‌డుతుంద‌ని లెక్క‌లు క‌డుతున్నారు.