‘ సింహాద్రి ‘ రీ రిలీజ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… పాత రికార్డులు పాతిపెట్టిన ఎన్టీఆర్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా అంతా దుమ్మురేగిపోయింది. అస‌లు ఎన్టీఆర్ బ‌ర్త్ డే కు సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ట్రెండింగ్ అయితే మామూలుగా లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన సింహాద్రి సినిమా అప్ప‌ట్లోనే ఇండ‌స్ట్రీ రికార్డులు బ్రేక్ చేసి ప‌డేసింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సింహాద్రి ఆ రోజుల్లోనే ఏకంగా 150కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌డంతో పాటు 55కు పైగా కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.

Watch Simhadri Movie Online for Free Anytime | Simhadri 2003 - MX Player

ఆ రోజుల్లోనే రు. 30 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏకంగా 1200 షోలు ప్ర‌ద‌ర్శించారు. ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లో సింహాద్రి రీ రిలీజ్ సినిమాల్లోనే స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఏకంగా ఫ‌స్ట్ డే సింహాద్రికి రు. 5 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి.

ఇది నిజంగానే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో స‌రికొత్త రికార్డ్‌. ఎన్టీఆర్ ద‌మ్ము ఏంటో ఈ సినిమాతో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఓ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఈ రేంజ్‌లో వ‌సూళ్లు అంటే మామూలు విష‌యం కాదు. ఇక సింహ‌ద్రి రీ రిలీజ్ వ‌సూళ్లు ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి.

Simhadri (2003) - Photo Gallery - IMDb

నైజాం – 1.10 కోట్లు
సీడెడ్ – 78 ల‌క్ష‌లు
ఆంధ్రా – 1.56 కోట్లు
క‌ర్నాట‌క – 32 ల‌క్ష‌లు
త‌మిళ‌నాడు – 13 ల‌క్ష‌లు
రెస్టాఫ్ ఇండియా – 34 ల‌క్ష‌లు
యూఎస్ఏ- 46 ల‌క్ష‌లు
అథ‌ర్ ప్లేసెస్ – 47 ల‌క్ష‌లు
————————————————-
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు – 5.14 కోట్లు
————————————————–