హీరోయిన్ గ‌జాలా ఆ హీరో కోసం సూసైడ్ ఎటెంప్ట్ చేసిందా…!

టాలీవుడ్లో 20 సంవత్సరాల క్రితం హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది గజాల. ముస్లిం అమ్మాయి అయినా గజాల అచ్చ తెలుగు ఆడపడుచులా తెలుగు ప్రేక్షకుల ఆదరభిమానాలు సొంతం చేసుకుంది. తొట్టి గ్యాంగ్ సినిమా హిట్ అయ్యాక గజాలకు మంచి పేరు వచ్చింది. ఇక ఆమెకు బాగా క్రేజ్ రావడానికి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కారణం. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడ నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆమె తొలిసారిగా 2001లో జగపతిబాబు హీరోగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది.

స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ తో మరోసారి అల్లరి రాముడు సినిమాలోనూ నటించింది. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాలలోనూ ఆమె హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ఉదయ్ కిరణ్‌తో కలుసుకోవాలని రోహిత్‌తో జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలలో కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కెరీర్ పరంగా మంచి ఊపులో ఉన్నప్పుడే గజాల ఇండస్ట్రీకి దూరమైంది.

ఆ టైంలో ఆమె ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ? ఉందన్న దానిపై చాలా సందేహాలు వచ్చాయి. హైదరాబాదులో తన గెస్ట్ హౌస్ లో నిద్ర మాత్రలు మింగి గజాలా ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పుకార్లు వచ్చాయి. అయితే తోటి నటులు సుల్తానా, సీనియ‌ర్ న‌టుడు అర్జున్ సమయానికి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో బతికి బయటపడిందని అంటారు. ఒక స్టార్ హీరో తనను మోసం చేశాడన్న బాధతోనే ఆమె ఆత్మ హత్యకు ప్రయత్నం చేసిందన్న వార్తలు వచ్చాయి.

ఆ హీరోని ఇష్టపడ్డ గజాలా.. అత‌డిని పెళ్లి చేసుకోవాలని అనుకుందని సడన్గా అతడు హ్యాండ్‌ ఇవ్వడంతో గజాలా ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న వార్త బాగా హాట్‌ టాపిక్ గా మారింది. గజాల ఏ హీరోను ప్రేమించింది అన్నదానపై ఇద్దరు సీనియర్ హీరోల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అందులో ఒకరు యాక్షన్ కింగ్ అర్జున్ కావటం విశేషం. అయితే అర్జున్ ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు హాస్పిటల్‌కు తరలించడం వల్లే ఈ రూమర్లు వచ్చాయట. ఆ తర్వాత కొంతకాలానికి గజాల హిందీ నటుడు అయినా పైజ‌ల్ రజాకాన్‌ను వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.