Dongalunnaru Jagratta : రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తారు. అయితే రాజమౌళి ఫ్యామిలీ సినిమా అంటే మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. రాజమౌళి బ్రదర్ కీరవాణి తనయుడు సింహా హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన అతను లేటెస్ట్ గా దొంగలున్నారు జాగ్రత్త సినిమాతో వచ్చాడు. ఈ సినిమా విషయంలో నిర్మాతలు మొక్కుబడిగా ప్రవర్తించారని అర్ధమవుతుంది. సింహా హీరోగా సతీష్ త్రిపుర డైరక్షన్ లో వచ్చిన సినిమా దొంగలున్నారు జాగ్రత్త.
ఈ సినిమాలో ప్రీతి అస్రాని, సముద్ర ఖని ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. సెప్టెంబర్ 23 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజైందన్న విషయం ఎవరికీ తెలియదు. ఈమధ్య సినిమాలకు బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తేనే ఓపెనింగ్స్ రావట్లేదు. ఏదో సినిమా రిలీజ్ ముందు రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చి సైలెంట్ గా రిలీజ్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు.
సింహా దొంగలున్నారు జాగ్రత్త సినిమా అదే విధంగా రిలీజైంది. సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారట. ఓ ఓటీటీతో డీల్ కూడా జరిగిందట. అయితే ఈమధ్య థియేట్రికల్ రిలీజైతే కానీ ఓటీటీలో డిమాండ్ రావట్లేదని అందుకే సినిమాని ఏదో నామ మాత్రంగా థియేట్రికల్ రిలీజ్ చేశారని తెలుస్తుంది. సినిమా కేవలం సర్వైవల్ థ్రిల్లర్ గా గంటన్నర్ నిడివితో వచ్చింది. అయినా సరే సినిమాని పట్టించుకున్నవారే లేరు.