Mega 154.. వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా..!

Mega 154 Venkatesh and Nagarjuna Cameo Roles

Mega 154 : మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వాళ్తేర్ వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఆల్రెడీ చిరుతో పాటుగా మాస్ మహరాజ్ రవితేజకి ఒక పవర్ ఫుల్ రోల్ ఇచ్చినట్టు తెలిసిందే. చిరు, రవితేజల మధ్య సీన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది. అయితే ఈమధ్య మెగా 154 సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కనిపిస్తారని అంటున్నారు.

వెంకీ మామ సినిమాలో చిన్న పాత్ర అయినా చేయడానికి రెడీ అంటాడు. అలా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఉంటాడని టాక్. ఇక వెంకీతో పాటుగా కింగ్ నాగార్జున కూడా చిరు సినిమాలో కనిపిస్తారట. వెంకటేష్, నాగార్జున, రవితేజ ఇలా మెగా 154 మెగా మల్టీస్టారర్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో చిరు మాస్ లుక్ ఆడియన్స్ ని ఫిదా చేస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుంటుందట. 2023 సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. చిరు, డిఎస్పీ కాంబో మ్యూజిక్ పరంగా అదిరిపోతుంది. మరి మెగా 154 ఇన్ని సర్ ప్రైజులతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags: KS Ravindra, Mega 154, Megastar Chiranjeevi, nagarjuna, RaviTeja, Valtair Veeraiah, Venkatesh