లవర్ బోయ్ సిద్ధార్థ్ (Siddharth ) ఇప్పటికీ కుర్రాడిలా ఉంటాడు. ఎప్పుడో 2006 లో వచ్చిన నువ్వస్తానంటే నేనొద్దంటానా సినిమా టైం లో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే స్మార్ట్ గా ఉన్నాడు. ఇక లవ్ స్టోరీస్ విషయంలో సిద్ధార్థ్ ని మించిన వారు ఎవరు ఉండరని చెప్పొచ్చు. ఈ క్రమంలో సిద్ధార్థ్ కొత్తగా ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని టాక్. అది ఎవరో కాదు తనతో మహా సముద్రంలో నటించిన అదితి రావు హైదరితోనే అని తెలుస్తుంది.
అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి నటించింది అదితి రావు హైదరి. ఈ సినిమా టైం లో వీరిద్దరు క్లోజ్ అయ్యారట. అలా సిద్ధుతో అదితి క్లోజ్ అవడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని టాక్. రీసెంట్ గా జరిగిన పొన్నియిన్ సెల్వన్ సినిమా ఈవెంట్ లో సిద్ధార్థ్ (Siddharth ) తో కలిసి అదితి ఒకే కార్ లో వచ్చింది.
అప్పుడు మీడియా కంట పడటంతో వీరి వ్యవహారం బయట పడ్డది. ఆల్రెడీ అంతకుముందు నుంచే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు రాగా ఈవెంట్ కి కూడా కలిసి వచ్చారంటే ఇక వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు కన్ ఫర్మ్ చేస్తున్నారు.