Balakrishna : ఇది బాలయ్య అంటే.. సప్తగిరి కాళ్లు మొక్కుతానని అన్న నట సింహం..!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఎంత గొప్ప నటుడో అంత మంచి మనిషి. ఆయన బయటకు అలా ఉగ్ర రూపం తో కనిపిస్తారే తప్ప ఆయన మనసు వెన్న. అది ప్రూవ్ చేస్తూ చాలా వీడియోలు బయటకు వచ్చాయి. లేటెస్ట్ గా ఒక వీడియో మాత్రం ప్రేక్షకులను సర్ ప్రైజ్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే బాలయ్య కమెడియన్ సప్తగిరి కలిసి ఎన్.టి.ఆర్ ఓ భారీ డైలాగ్ చెప్పబోతున్నారు. అయితే సప్తగిరి ఆల్రెడీ ఆ డైలాగ్ ని కంఠస్తం చేయడంతో బాలయ్య అతన్ని ఫాలో అవుతున్నాడు.

ఈ క్రమంలో Balakrishna సైలెంట్ అయితే సప్తగిరి ఆ డైలాగ్ ని పూర్తి చేశాడు. దానికి సప్తగిరి నీ కాళ్లు మొక్కుతా అని బాలయ్య బెండ్ అవుతాడు. అప్పుడు సప్తగిరే బాలయ్య కాళ్ల మీద పడతాడు. 100 సినిమాలు తీసినా సరే ఎదుటి వ్యక్తిలో ప్రతిభ ఉందని గుర్తించిన బాలకృష్ణ ఆయన కాళ్లు పట్టుకుంటా అని అడగడ అది కూడా తన కన్నా చిన్నవాడైన కమెడియన్ సప్తగిరితో బాలయ్య అలా ప్రవర్తించడం నిజంగానే బాలయ్య మంచి మనసుని తెలియచేస్తుంది.

ఆయన అభిమానులని కొడతాడు.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడన్న విష ప్రచారాలే తప్ప. ఇలాంటి వాటిని మీడియా ఎక్స్ పోజ్ చేయదు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్న సినిమా సెట్స్ లో ఇదంతా జరిగింది. బాలయ్య తనని మెచ్చుకోవడం సప్తగిరి షాక్ అయ్యాడని చెప్పొచ్చు.

 

Tags: balakrishna, Balayya Babu, Gopichand Malineni, NBK, NBK 107, Saptagiri, Tollywood