సినిమా పరిశ్రమలో రెండు వరుస ఫ్లాపులు పడితే ఇక వరి పని అయిపోయింది అనుకుంటారు. కెరియర్ లో కొంత గ్యాప్ వచ్చినా సరే పెట్టా బేడా సర్ధేయడమే అనేట్టుగా ప్రచారం చేస్తారు. కానీ వారిలో టాలెంట్ ఉంటే మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తాయి. ఇంతకీ ఇదంతా దేనికి అంటే కోలీవుడ్ భామ శృతి హాసన్ (Shruthi Hassan) తెలుగు కెరియర్ దాదాపు ముగిసిందని అనుకున్నారు. ఆమె ఇక్కడ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో శృతి హాసన్ ని లైట్ తీసుకున్నారు.
కానీ లేటెస్ట్ గా శృతి రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో సందడి చేస్తుంది. అందులో ఒకటి పాన్ ఇండియా సినిమా అవడం విశేషం. ప్రభాస్ తో సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శృతి హాసన్ (Shruthi Hassan) ఆ సినిమాతో పాటుగా బాలకృష్ణ 107 సినిమాలో కూడా ఫీమేల్ లీడ్ గా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో తెలుగులో మళ్లీ తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యింది శృతి హాసన్.
కెరియర్ అయిపోయింది తెలుగులో ఆమెకు ఛాన్సులు కష్టమే అనుకున్న టైం నుంచి మళ్లీ వరుస అవకాశాలతో శృతి హాసన్ తన టాలెంట్ చూపిస్తుంది. ఇక అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో కూడా షాక్ ఇస్తుందట. పారితోషికం కూడా పెంచేసిందని టాక్.